ప్రభుత్వ వాణిజ్య కార్యకలాపాల్లో అన్ని బ్యాంకులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత ఉద్యోగుల సంఘం వ్యతిరేకించింది. ప్రైవేటు బ్యాంకులకు సమప్రాధాన్యం ఇస్తామంటున్న ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల స్థాపన, వ్యవసాయ రుణాలు, ప్రాధాన్య రంగాల రుణం తదితర అంశాల్లో ప్రైవేటు బ్యాంకులకు మినహాయింపు ఎందుకో చెప్పాలని ప్రశ్నించింది. ప్రభుత్వరంగ బ్యాంకులు 42 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరిస్తే.. ప్రైవేటు బ్యాంకులు కేవలం 1.25 కోట్ల ఖాతాలు మాత్రమే తెరిచాయని పేర్కొంది.
కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: అఖిల భారత ఉద్యోగుల సంఘం - కేంద్రం నిర్ణయంపై మండిపడ్డ అఖిల భారత ఉద్యోగుల సంఘం
ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేటు బ్యాంకులకు అవకాశం ఇస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని అఖిల భారత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వ బ్యాంకుల ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించిన అఖిల భారత ఉద్యోగుల సంఘం
వ్యవసాయ రుణాలు, పేద విద్యార్థులకు విద్యా రుణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల స్థాపన విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోటీ పడేలా చేయాలని కోరింది. ఈ రుణాల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులపై భారం పడుతోందని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంతో బ్యాంకులు పేదలకు రుణాలందించలేవని వెల్లడించింది. ఈ నిర్ణయం ప్రభుత్వ బ్యాంకుల ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.