తెలంగాణ

telangana

ETV Bharat / city

LIVE: దిశ నిందితుల మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం - ప్రియాంక రెడ్డి

encounter
encounter

By

Published : Dec 6, 2019, 9:16 AM IST

Updated : Dec 6, 2019, 9:33 PM IST

21:29 December 06

ఎన్‌కౌంటర్‌ ఘటనపై హైకోర్టులో అత్యవసర విచారణ

దిశ ఘటనలో నిందితుల ఎన్​కౌంటర్​ ఘటనపై హైకోర్టు స్పందించింది. అత్యవసర విచారణ జరుపుతామని వెల్లడించింది. మృతదేహాలను ఈ నెల 9 తేదీ  రాత్రి 8 వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9న ఉదయం 10.30 గం.లకు హైకోర్టు విచారణ జరపనుంది. సాయంత్రం 6 గం.కు అందిన వినతిపత్రంపై హైకోర్టు  అత్యవసరంగా స్పందించింది. హైకోర్టు విచారణకు అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ హాజరయ్యారు. గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ నిపుణుల బృందంతో పోస్టుమార్టం జరుగుతోందని ఏజీ ధర్మాసనానికి వివరించారు. 

21:02 December 06

మృతదేహాలకు శవపరీక్ష పూర్తి

మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలకు శవపరీక్ష పూర్తయింది.

19:26 December 06

ఎస్సై, కానిస్టేబుల్​ హెల్త్​ బులెటిన్​ విడుదల

ఎస్సై, కానిస్టేబుల్​ హెల్త్​ బులెటిన్​ విడుదల

దిశ నిందితుల చేతుల్లో గాయాలపాలైన ఎస్సై వెంకటేశ్, కానిస్టేబుల్ అరవింద్ మెరుగైన వైద్యం కోసం  గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి కేర్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్​ విడుదల చేసింది. వారికి ఎలాంటి ప్రాణహాని లేదని... కానిస్టేబుల్​కు ఎడమ చెయ్యికి, భుజాల పైన గాయాలు కాగా.. ఎస్సైకి  తలపైన గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు.  వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

19:15 December 06

మృతదేహం అప్పగించాలని చెన్నకేశవులు భార్య ఆవేదన

మహబూబ్‌నగర్​లో మీడియా ముందు చెన్నకేశవులు భార్య రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మృతదేహం అప్పగించాలని  కన్నీటి పర్యతమయ్యారు.

18:08 December 06

నిందితుల స్వగ్రామాల్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి

మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దిశ కేసు నిందితుల మృతదేహాలకు శవపరీక్ష నిర్వహిస్తున్నారు.నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు మృతదేహాలను చూపించి బయటకు పంపించారు. నిందితుల స్వగ్రామాల్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అవాంఛనీయ ఘటనలు జరగుండా ఆస్పత్రి, నిందితుల స్వగ్రామాల్లో పోలీసులు భారీ  బందోబస్తు ఏర్పాటు చేశారు.

15:59 December 06

మృతదేహాలు మహబూబ్​నగర్​ ఆస్పత్రికి తరలింపు

మహబూబ్​నగర్​ జిల్లా ఆస్పత్రి వద్ద భారీ భద్రత

దిశా కేసు నిందితుల మృతదేహాలు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు.  జిల్లా ఆస్పత్రి వద్ద ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. 
 

15:46 December 06

నిందితులు తుపాకీ లాక్కుని కాల్పులకు యత్నించారు -సీపీ

సీన్​ రీకన్​స్ట్రక్షన్​ కోసం కాదు.. దిశ వస్తువుల కోసం

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ కోసం రాలేదని, దిశ వస్తువుల సేకరణ కోసం చటాన్​పల్లి వంతెన వద్దకు వచ్చామని సీపీ సజ్జనార్​ వెల్లడించారు. ఘటనపై ఎలాంటి అవాస్తవాలు ప్రసారం చేయొద్దు కోరారు.

15:29 December 06

ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా నేరాలు

దిశ కేసులో నిందితులు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయని సీపీ సజ్జనార్​ తెలిపారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఇదే తరహాలో నేరాలు చేసినట్లు సమాచారం ఉందని వెల్లడించారు. అనుమానిత, గుర్తుతెలియని మరణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాధితులు, నిందితుల కుటుంబ సభ్యుల వివరాలు కూడా గోప్యంగా ఉంచాలని కోరారు.

15:29 December 06

నిందితుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు

దిశకు సంబంధించిన వస్తువులు చూపెడతామంటే నిందితులను చటాన్​పల్లి వంతెన వద్దకు తీసుకువచ్చామని సీపీ సజ్జనార్​ వెల్లడించారు. అనంతరం వారు పోలీసులపై దాడికి పాల్పడ్డారని తెలిపారు.

ఈ దాడిలో ఒక కానిస్టేబుల్​, మరో ఎస్సై గాయపడ్డారని సీపీ తెలిపారు. వారు మహబూబ్​నగర్​ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు.

15:26 December 06

దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్​ వివరాలు వెల్లడించిన సీపీ

దిశ అత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటన వివరాలను సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. దిశకు సంబంధించిన వస్తువులు చూపెడతామంటే నిందితులను స్పాట్​కు తీసుకు వచ్చామని తెలిపారు. ఘటనాస్థలంలో వస్తువులు చూపెట్టకుండా పోలీసులపై దాడికి దిగారన్నారు.

నిందితులు కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడికి దిగారని సీపీ వెల్లడించారు. పోలీసుల వద్ద తుపాకీ కూడా లాక్కుని కాల్పులకు యత్నించారని తెలిపారు. హెచ్చరించినా.. వినకపోవడం వల్లే ఎన్​కౌంటర్​ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

15:21 December 06

ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ

దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ... పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

15:17 December 06

ఘటనాస్థలికి బయలుదేరిన మృతుల తల్లిదండ్రులు

ఘటనాస్థలికి మృతుల తల్లిదండ్రులు బయలుదేరారు. నారాయణపేట జిల్లా గుడిగండ్ల నుంచి తల్లిదండ్రులను పోలీసులు తీసుకెళ్లారు. ఘటనాస్థలికి మహ్మద్ పాషా తండ్రి హుస్సేన్, నవీన్ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కురుముప్ప బయలుదేరారు. మృతుల తల్లిదండ్రులతో వనపర్తి ఎస్పీ అపూర్వరావు మాట్లాడారు. 

14:22 December 06

ఘటనాస్థలిలో నిందితుల మృతదేహాలకు శవపంచనామా

ఘటనాస్థలిలో దిశ హత్యాచారం నిందితుల మృతదేహాలకు నలుగురు ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌లు శవపంచనామా నిర్వహించారు. ఏ1 మహ్మద్ పాషా మృతదేహానికి ఫరూక్‌నగర్ తహసీల్దార్ పాండునాయక్, ఏ2 చెన్నకేశవులు మృతదేహానికి కొందుర్గు తహసీల్దార్ శ్రీకాంత్, ఏ3 శివ మృతదేహానికి నందిగామ తహసీల్దార్ హైదర్ అలీ, ఏ4 నవీన్ మృతదేహానికి చౌదరిగూడ తహసీల్దార్ రాముడు పంచనామా చేశారు.

13:08 December 06

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భగల్‌ స్పందించారు. బాధితులకు న్యాయం జరిగిందని చెప్పారు.

12:47 December 06

ఘటనాస్థలిలో నిందితుల మృతదేహాలకు శవపంచనామా

దిశ హత్యాచారం కేసులో పోలీసుల పని తీరును ఆమె కుటుంబ సభ్యులు ప్రశంసించారు. తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూర్చారని పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చటాన్​పల్లి వంతెన వద్ద దిశ హత్యకు గురైన ప్రాంతానికి వెళ్లి పూలు సమర్పించి నివాళి అర్పించారు. తెలంగాణ పోలీసుల చర్యల వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు.

11:52 December 06

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సీపీ సజ్జనార్ బృందం, హైదరాబాద్‌ పోలీసులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

న్యాయం జరిగింది: నటుడు అక్కినేని నాగార్జున
తెలంగాణ పోలీసులకు సెల్యూట్. భయానికి సరైన సమాధానం దొరికింది.. అప్పుడప్పుడు ఇదే పరిష్కారం: సమంత
న్యాయం జరిగింది: సినీనటులు అల్లు అర్జున్‌, విష్ణు, హన్షిక
ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడై ఉండాలి: నాని
న్యాయం జరిగింది: సినీనటుడు రవితేజ, దర్శకుడు కోన వెంకట్‌
చివరకు న్యాయం జరిగింది: సినీనటుడు విశాల్‌
హైదరాబాద్‌ పోలీసులకు సెల్యూట్‌: సైనా నెహ్వాల్‌
 

11:40 December 06

ఘటనా స్థలిలో దిశకు నివాళులు

ఆ రైతు పొలంలోనే ఎన్​కౌంటర్​

దిశ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన రైతు సత్యం పొలంలోనే నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగింది.

10:34 December 06

డయల్ 100కు అభినందనల వెల్లువ

పోలీసులను అభినందిస్తూ డయల్ 100కు పెద్దఎత్తున కాల్స్ వస్తున్నాయి. చటాన్‌పల్లి వంతెన పైనుంచి పోలీసులపై ప్రజలు పూలు చల్లి అభినందిచారు. పోలీసు అధికారులకు స్థానికులు మిఠాయిలు  తినిపించారు. 

10:28 December 06

మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలోనే శవపరీక్ష

ఒక్కో మృతదేహానికి ఒక్కో న్యాయాధికారి సమక్షంలో శవపంచనామా నిర్వహించనున్నారు. శవపంచనామా అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి మృతదేహాలను తరలిస్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలోనే శవపరీక్ష నిర్వహించనున్నారు. శవపరీక్ష పూర్తయ్యాక మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. పోస్టుమార్టం కోసం మహబూబ్‌నగర్‌కు ఐదుగురు గాంధీ ఆస్పత్రి వైద్యులు వెళ్లనున్నారు.

10:22 December 06

దర్శకుడు హరీశ్‌ శంకర్​ ట్విట్టర్​ ప్రొఫైల్​ ఫొటోగా సీపీ సజ్జనార్​  ఫొటో

ఎన్‌కౌంటర్‌ను చాటింపు వేసి చెప్పాలని దర్శకుడు హరీశ్‌ శంకర్ ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో తన ప్రొఫైల్ ఫొటో తీసి సజ్జనార్ ఫొటో పెట్టుకున్నారు. సినిమా టీజర్లు, ట్రైలర్లు ట్రెండింగ్ కాదు.. ఈ ఎన్‌కౌంటర్‌ ట్రెండింగ్ అవ్వాలని అన్నారు.

10:09 December 06

దర్శకుడు హరీశ్‌ శంకర్​ ట్విట్టర్​ ప్రొఫైల్​ ఫొటోగా సీపీ సజ్జనార్​  ఫొటో

ఎన్‌కౌంటర్‌ను చాటింపు వేసి చెప్పాలని దర్శకుడు హరీశ్‌ శంకర్ ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో తన ప్రొఫైల్ ఫొటో తీసి సజ్జనార్ ఫొటో పెట్టుకున్నారు. సినిమా టీజర్లు, ట్రైలర్లు ట్రెండింగ్ కాదు.. ఈ ఎన్‌కౌంటర్‌ ట్రెండింగ్ అవ్వాలని అన్నారు.

10:07 December 06

మంచి నిర్ణయం: దిశ సోదరి 

నిందితులను ఉరితీస్తారని అనుకున్నాం, ఎన్‌కౌంటర్‌ మంచి నిర్ణయమని దిశ సోదరి హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. తమకు అండగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఇదీ చూడండి: మానవ మృగాలను కాల్చి చంపడమే సరైంది

10:04 December 06

మంచి నిర్ణయం: దిశ సోదరి

చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌: సీపీ సజ్జనార్

నిందితుల ఎన్‌కౌంటర్‌ను సీపీ సజ్జనార్ నిర్ధరించారు. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్యలో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలిపారు. చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌ జరిగిందని వివరించారు.

ఇదీ చూడండి: 24 గంటల్లో అరెస్ట్​... 9 రోజుల్లో ఎన్​కౌంటర్​​

09:53 December 06

ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతం

ఆత్మకు శాంతి చేకూరుతుంది: దిశ తండ్రి

ఎన్‌కౌంటర్‌ ఒక మంచి నిర్ణయమి దిశ తండ్రి హర్షం వ్యక్తం చేశారు. నిర్భయ కేసులో ఏడేళ్లైనా శిక్ష పడలేదని... తన కుమార్తె విషయంలో 10 రోజుల్లో మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు అండగా నిలిచారని చెప్పారు.

09:43 December 06

వారంరోజుల్లో న్యాయం జరగడం సంతోషం

తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యను నిర్భయ తల్లి స్వాగతించారు. ఏడేళ్ల నుంచి తన కుమార్తె కోసం పోరాటం కొనసాగుతూనే ఉందని అన్నారు. దిశ తల్లిదండ్రులకు 7 రోజుల్లో న్యాయం జరగడం సంతోషంగా ఉందని తెలిపారు.

09:31 December 06

ట్విట్టర్​ ట్రెండింగ్​

దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు నిందితులను సైబరాబాద్​ పోలీసులు ఈరోజు ఉదయం ఎన్​కౌంటర్​ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులను కీర్తిస్తూ ట్విటర్​లో ట్వీట్​లు హోరెత్తుతున్నాయి. ట్విటర్​లో టాప్​ 5లో తెలంగాణ పోలీస్​ హ్యాష్​ ట్యాగ్​ ట్రెండ్​ అవుతోంది.

09:25 December 06

దిశ నిందితుల ఎన్​కౌంటర్​

సమర్థనీయమే: సీపీఐ నేత నారాయణ

ఎన్‌కౌంటర్‌ చేయడం సమర్థనీయమేనని సీపీఐ నేత నారాయణ అన్నారు. పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలు సమర్థనీయమేనని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ను సీపీఐ సమర్థిస్తుందని వెల్లడించారు.

09:22 December 06

న్యాయం జరిగింది: జూనియర్ ఎన్టీఆర్

దిన నిందితులను ఎన్​కౌంటర్​ చేయడం ద్వారా న్యాయం జరిగిందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. దిశ ఆత్మకు శాంతి చేకూరిందని పేర్కొన్నారు.

09:19 December 06

దిశ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశను కాల్చిన చోటే ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించిన నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధరించారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఎన్‌కౌంటర్‌లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. తెల్లవారుజామున నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించారు.

09:04 December 06

దిశ నిందితుల ఎన్​కౌంటర్​

దిశ నిందితుల ఎన్​కౌంటర్​

దిశ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశను కాల్చిన చోటే ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించిన నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధరించారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఎన్‌కౌంటర్‌లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. తెల్లవారుజామున నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించారు.

Last Updated : Dec 6, 2019, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details