రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు ఇలా... - alcohol price hike
20:34 May 18
మందుబాబులకు కేసీఆర్ సర్కార్ షాక్..
తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. మద్యం ధరలను దాదాపు 20 నుంచి 25 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక్కో బీరుపై రూ.10, క్వార్టర్ లిక్కర్ సీసాపై రూ.20, వెయ్యి ఎంఎల్‌ల లిక్కర్‌పై రూ.120 వరకు ధర పెరిగింది. పెంచిన మద్యం ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, ఆయా బ్రాండ్‌లను బట్టి ధరల్లో స్వల్ప తేడా ఉండనుంది.
2021-23 మద్యం విధానం అమల్లోకి వచ్చాక ధరలు పెంచడం ఇదే తొలిసారి. ఈ అంశంపై బుధవారం రాత్రి వరకు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఏ రకం మద్యంపై ఎంత ధర పెంచాలనే విషయంలో రాత్రి స్పష్టత రాకపోగా.. ఈ ఉదయం నిర్ణయం తీసుకున్నారు. బుధవారం రాత్రి మద్యం విక్రయ వేళలు ముగియగానే వైన్స్, బార్లు, పబ్‌లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు ఆయా నిర్వాహకులకు ముందస్తుగానే సమాచారం అందించిన విషయం తెలిసిందే.
- లిక్కర్‌పై 20 నుంచి 25 శాతం పెంపు
- వెయ్యి ఎంఎల్ లిక్కర్‌పై రూ. 120 పెంపు
- లిక్కర్ క్వార్టర్ సీసాపై రూ. 20 పెంపు
- అన్ని రకాల బీర్లపై రూ. 10 చొప్పున పెంపు