ఓయూలోని నాన్‌టీచింగ్ హాల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని.. ఎస్సీ రిజర్వేషన్‌ను ఏ,బీ,సీగా వర్గీకరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
ఓయూలో మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమం - telangana news
ఓయూలో నిర్వహించిన మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగలు హాజరయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఓయూలో మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమం
ఎస్సీ కార్పొరేషన్ రుణాలను 12 నుంచి 20 లక్షలకు పెంచాలని.. మాదిగ, మాల, ఉపకులాలుగా విభజించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మరింత పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు.
ఇదీ చూడండి:2ఎకరాల నుంచి 170ఎకరాలు... కేసీఆర్ మెచ్చిన సాగు ధీరుడు