తెలంగాణ గవర్నర్గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ జలవిహార్లో అలయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజకీయాలకతీతంగా అన్నిపార్టీల వారు ఒకతాటిపైకి రావడం గొప్ప విషయమని కొనియాడారు.
జలవిహార్లో సందడిగా అలయ్ బలాయ్
హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తనకు మార్గదర్శకులని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజకీయాలకతీతంగా అన్నిపార్టీల నేతలు ఒక తాటిపైకి రావడం గొప్పవిషయమని కొనియాడారు. జలవిహార్లో దత్తన్న నిర్వహించిన అలయ్ బలాయ్కు అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.
15 ఏళ్లుగా అలయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజలు శాంతి, సామరస్యంగా ఉండాలని కోరుకున్నారు. తెలంగాణ, హిమాచల్ప్రదేశ్లను పర్యటకంగా అనుసంధానం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అవినీతి, ప్లాస్టిక్ భూతాన్ని దేశం పొలిమేరకు తరమాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, తెదేపా నేత ఎల్రమణ, కాంగ్రెస్ నేత వీహెచ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యా సాగర్రావు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తదితర భాజపా, తెరాస, కాంగ్రెస్, తెదేపా నేతలకు శాలువా కప్పి అలయ్ బలాయ్ చేసుకున్నారు బండారు దత్తాత్రేయ.
- ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈనెల 15కు వాయిదా