తెలంగాణ

telangana

ETV Bharat / city

అల వైకుంఠపురం 50రోజుల సంబరాలు - అలా వైకుంఠపురం 50 రోజుల వేడుకలు

అల వైకుంఠపురం సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు అంబర్​పేటలోని శ్రీ రమణ థియేటర్​లో సంబరాలు నిర్వహించారు.

Ala Vaikuntapuram 50 days Celebrations
అల వైకుంఠపురం 50రోజుల సంబరాలు

By

Published : Mar 1, 2020, 3:39 PM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం సినిమా దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. అంబర్​పేటలోని శ్రీ రమణ థియేటర్​లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవి ఆధ్వర్యంలో అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.

అల వైకుంఠపురం 50రోజుల సంబరాలు

అభిమానులు ఏర్పాటు చేసిన అల వైకుంఠపురం 50 రోజుల వేడుకలకు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకు కట్ చేశారు. అల వైకుంఠపురం సినిమా విజయం అభిమానులు బన్నీకి ఇచ్చిన బహుమానం అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్​ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇలాంటి ఎన్నో సూపర్​హిట్ సినిమాలు తీసి.. తమ హీరో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని అభిమానులు అశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details