ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అఖండ జ్యోతి ప్రజ్వల చేశారు. బర్కత్‌పురలోని యాదాద్రి భవన్ నుంచి అఖండ జ్యోతి మహా పాదయాత్రను అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కిషన్ రావు ప్రారంభించారు.
అఖండ జ్యోతి మహా పాదయాత్ర ప్రారంభం - యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ బర్కత్‌పుర నుంచి అఖండ జ్యోతి మహా పాదయాత్రను అంబర్‌పేట ఎమ్మెల్యే ప్రారంభించారు.
అఖండ జ్యోతి మహా పాదయాత్ర ప్రారంభం
గత 26 సంవత్సరాలుగా హైదరాబాద్‌కు చెందిన మంథని నాగరాజు కుటుంబీకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతి మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈయాత్ర బర్కత్‌పురలోని యాదాద్రి భవన్ నుంచి ప్రారంభమై హైదరాబాదులోని పలు ప్రాంతాలమీదుగా సాగనుంది. రాత్రికి ఉప్పల్‌లో సేదతీరి, రేపు ఘట్కేసర్లో, ఎల్లుండి భువనగిరి మీదుగా 24 వ తేదీ సాయంత్రానికి యాదాద్రి చేరుకోనుంది.
ఇవీ చూడండి:సిగరెట్లను మొక్కులుగా స్వీకరిస్తున్న త్రినేత్రుడు