ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు టి.నరసింహన్... ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలవాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హిమాయత్‌నగర్ మఖ్ధూంభవన్‌లో నిర్వహించిన టి.నరసింహన్ సంస్మరణ సభకు హాజరయ్యారు. విలువలు, ఆశయాలు మూర్తీభవించిన నాయకుడని కొనియాడారు. కార్యకర్తల్లో ఉత్తేజం, ప్రేరణ కలిగించే ప్రసంగాలు చేసేవారని గుర్తు చేసుకున్నారు.
విలువలు, ఆశయాలు కలిగిన నాయకుడు టి. నరసింహన్: నారాయణ - ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు టి. నరసింహన్ సంస్మరణ సభ
ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు టి. నరసింహన్ సంస్మరణ సభ... హిమాయత్‌నగర్‌లోని మఖ్ధూంభవన్‌లో నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హాజరై... నరసింహన్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఎక్కడ కార్మికోద్యమం జరిగినా నరసింహన్ బాసటగా నిలిచేవారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కార్మిక ఉద్యమంతో మమేకమై... జాతీయ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. ఆర్టీసీ, సింగరేణి, బ్యాంకులు, మెడికల్ సంఘాల బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక సంఘాలకు సూచనలు చేస్తూ... ఉద్యమానికి దిశానిర్దేశం చేసేవారని గుర్తు చేశారు. నరసింహన్ ఆశయ సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:రాజన్నరాజ్యం కాదు.. రామరాజ్యం కావాలి: ఎంపీ అర్వింద్