ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ సంసిద్ధతను ప్రకటించింది. ఇప్పటికే ఉన్న 4జీ స్పెక్ట్పమ్లో 1800 ఎంహెచ్‌జడ్ బ్యాండ్ పవర్‌తో ఈ 5జీ సేవలు కొనసాగుతాయని భారతీ ఎయిర్టెల్ ఏపీ, తెలంగాణ సీఈవో అవనీత్ సింగ్ పూరి తెలిపారు. హైదరాబాద్ హైటెక్‌సిటీలో ఎయిర్టెల్ 5జీ నెట్ లైవ్ ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కేవలం 25 సెకన్లలోపే..
5జీ నెట్‌వర్క్‌తో ఒక జీబీ ఫైల్‌ను కేవలం 25 సెకన్లలోపే డౌన్లోడ్ చేసుకోవచ్చని.. తద్వారా ఫైల్స్, యాప్స్‌ను వేగంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. 5జీ నెట్‌వర్క్‌కు అవసరమైన ఎకోసిస్టం సిద్ధమైతే త్వరలోనే తమ 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభం చేయనున్నామని ప్రకటించారు.