లండన్‌కు రాకపోకలు సాగించే తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. ఇకపై హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు లండన్ నుంచి మొదటి విమానం నేడు హైదరాబాద్ చేరుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. రేపు హైదరాబాద్ నుంచి లండన్ నాన్‌స్టాప్ విమానం టేకాఫ్ కానుందని వెల్లడించింది.
Air India: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఎయిర్ ఇండియా - తెలంగాణ వార్తలు
హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమానాలు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు లండన్ నుంచి మొదటి ఫ్లైట్ నేడు హైదరాబాద్ చేరుకుంటుందని ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటివరకు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, గోవా, అమృత్‌సర్ నగరాల నుంచే లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు ఉండగా.. ఇకపై హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరనుంది. బోయింగ్ 787 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా 256 సీట్లతో వారానికి రెండుసార్లు ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ఎయిరిండియా తెలిపింది. ఇందులో 18 బిజినెస్ క్లాసులు, 238 ఎకానమీ క్లాసులు ఉంటాయంది. భారత్-యూకే సెక్టార్ మధ్య విమానయాన సంబంధాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఎయిరిండియా అభిప్రాయపడింది.