Nash Day in AIG Hospital: ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వారు కేవలం 10 శాతం మంది బరువు తగ్గటం ద్వారా ఈ సమస్యని నియంత్రించుకోవచ్చని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి అన్నారు. నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటీస్(నాష్) డే ని పురస్కరించుకుని ఏఐజీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వైద్యులతో కలిసి ఆయన కాలేయ సమస్యలపై మాట్లాడారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లోనూ సుమారు 30 శాతం మందికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి అన్నారు.
'గ్రామీణ ప్రాంతాల్లోనూ 30శాతం మంది ఫ్యాటీ లివర్ బాధితులు'
Nash Day in AIG Hospital: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ సుమారు 30 శాతం మందికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. 'నాష్ డే' ని పురస్కరించుకుని ఏఐజీ ఆసుపత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.
ఏఐజీ ఆసుపత్రి నేతృత్వంలో సుమారు లక్షమంది రిపోర్టులను పరిశీలించి ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతున్న విషయాన్ని గుర్తించినట్టు వివరించారు. దేశంలో మరో వెయ్యి మంది జెనెటిక్ పరీక్షలు చేసిన తర్వాత... జీన్స్లో వస్తున్న మార్పుల కారణంగా ఈ సమస్య బారినపడుతున్న వారు అధికంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఎలాంటి చెడు వ్యసనాలు లేకపోయినా... జెనెటికల్ గానూ, బరువు కారణంగాను ఫ్యాటీ లివర్ బాధితులు పెరుగుతున్నారన్నారు. ఫ్యాటీ లివర్ సమస్యలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా... ఈ సమస్య ఉన్న వారిలో క్రమంగా గుండెపోటు రావడం, కాలేయం పూర్తిగా పనిచేయకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నార. తద్వారా ఆ సమస్య మరణానికి దారి తీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:ఆ నివేదికను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరముంది: కేటీఆర్