పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ నాంపల్లిలోని సాంకేతిక విద్యా కమిషనర్ కార్యాలయం ముందు ఆల్ ఇండియా డెమొక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ధర్నా నిర్వహించింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజంభిస్తున్న నేపథ్యంలో... రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు సప్లమెంటరీ పరీక్ష రాస్తున్నారని ఆర్గనైజేషన్ నాయకులు తెలిపారు.
'పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి' - hyderabad news
హైదరాబాద్ నాంపల్లిలోని సాంకేతిక విద్యా కమిషనర్ కార్యాలయం ముందు ఆల్ ఇండియా డెమొక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ధర్నా నిర్వహించింది. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వెంటనే హాస్టల్ సదుపాయం కల్పించాలని కోరారు.
ఈ పరీక్షలు రాయడానికి విద్యార్థులు గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఉన్న కాలేజీలకు వచ్చేందుకు రవాణా, హాస్టల్ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సప్లమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వెంటనే హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆఖరి సంవత్సర సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు... టీఎస్ఈసెట్ రెండో విడత కౌన్సిలింగ్ కంటే ముందే విడుదల చేయాలని కోరారు. ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్లో ప్రవేశం పొందే విద్యార్థులను 20 శాతం నుంచి 10 శాతానికి కుదించే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.