ఆర్థిక స్థోమత లేక ఉన్నతవిద్యకు దూరమవుతున్న ప్రతిభగల విద్యార్థినీవిద్యార్థులు పీజీ చదివేందుకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించేలా ఆల్ ఇండియా సెంటర్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇప్పుడు స్కాలర్షిప్ను ప్రవేశపెట్టింది. ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థలు, యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులు.
ఎంపికైన విద్యార్థులకు ఏఐసీటీఈ రెండేళ్ల పాటు ప్రతినెలా రూ.12,400 స్కాలర్షిప్ అందజేస్తుంది. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులు. అయితే వారు తప్పనిసరిగా GATE, CEED, GPAT వంటివి క్వాలిఫై అయి ఉండాలి.
అభ్యర్థులు ఫుట్ టైమ్ రీసెర్చ్ స్కాలర్‌గా ప్రవేశం పొందాలి. పార్ట్‌టైమ్ విధానంలో పీజీ చేసే వారు దరఖాస్తుకు అనర్హులు. ఐదేళ్ల డ్యుయల్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేస్తున్న విద్యార్థులు చివరి ఏడాది.. అంటే 9వ సెమిస్టర్ నుంచి స్కాలర్షిప్కు అర్హులు. అయితే వారు మునుపటి ఏడాదిలో 8 లేదా అంతకంటే ఎక్కువ CGPA స్కోరు సాధించి ఉండాలి. స్కాలర్షిప్ గరిష్టంగా 24 నెలల పాటు లేదా కోర్సు పూర్తయ్యే వరకు అందజేస్తారు.