రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఎం.పీ మానిక్కమ్ ఠాగూర్ ధీమావ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎవరి స్థాయిలో వారు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి తెరాస పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నందన్నారు. అప్పడు తెరాస ఎంత ఖర్చు పెట్టినా... గెలుపు కాంగ్రెస్‌దేనని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని జోస్యం చెప్పారు.
'తెరాస ఎంత ఖర్చు పెట్టినా... ఈసారి గెలుపు కాంగ్రెస్‌దే' - రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కమ్ ఠాగూర్
రాష్ట్రంలోని మాజీ ఎమ్యెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్‌లతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఎవరి స్థాయిలో వారు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని ఠాగూర్ సూచించారు.
కింది స్థాయి నుంచి అన్ని అంశాలపై పోరాటం చేయాలని... క్రమశిక్షణతో కలిసికట్టుగా పని చేయడం ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. ఇవాళ జూమ్ యాప్ ద్వారా రాష్ట్రంలోని మాజీ ఎమ్యెల్యేలు, మాజీ ఎంఎల్సీలు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్‌లతో మానిక్కం ఠాగూర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిచయం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం పలువురు నాయకులు వారి అభిప్రాయాలను, సూచనలను ఇంఛార్జి దృష్టికి తెచ్చారు.
వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచారం చేసుకునే వెసులుబాటు అసెంబ్లీ అభ్యర్థులకు ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ పార్టీతో ఇక్కడ పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షులకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. పొత్తుల విషయంలో స్థానిక నాయకత్వానికి స్వేచ్ఛ ఇవ్వాలని... ఏ పార్టీతో ఏ మేరకు కలిసి పనిచేయలో స్థానిక నాయకత్వం పరిశీలిస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని వివరించారు.
ఇదీ చూడండి: 'రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది'
TAGGED:
congress meeting in zoom app