తెలంగాణ

telangana

ETV Bharat / city

'అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి' - 'అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి'

తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌... బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఆవిష్కరించారు. ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

'అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి'
'అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి'

By

Published : Feb 10, 2020, 6:03 AM IST

ప్రశ్నించే గొంతులను రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుందని... ఎఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్‌ విమర్శించారు. ఆచార్య కాశీం అరెస్ట్‌ను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం రూపొందించిన... నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అణచివేత వేత దోరణి అవలంభిస్తున్న తెరాస ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఉద్యోగ, రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఉందని కేసీఆర్ గుర్తించుకోవాలని హితువు పలికారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలను ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కుమ్మక్కై వేల కోట్ల సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నడిచిన నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని కేసీఆర్‌ పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

'అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి'

ఇదీ చూడండి:ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జయేశ్‌ రంజన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details