పోతిరెడ్డిపాడు టెండర్లను రద్దు చేయించలేకపోతే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టడానికి కారణమేంటని వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు వెళతారా.. అని మండిపడ్డారు. కేసీఆర్‌కు తెలంగాణ కంటే ఏపీ కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. పోతిరెడ్డిపాడుతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారని వంశీచంద్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
అందుకే అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేసీఆర్ డుమ్మా కొట్టారు: వంశీచంద్‌రెడ్డి - పోతిరెడ్డిపాడు వార్తలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యమని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. అందుకే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాలేదని విమర్శించారు. ఏపీ సర్కారు జలదోపిడిని అడ్డుకోవడంలో కేసీఆర్ సర్కారు విఫలమయిందని ధ్వజమెత్తారు.
అందుకే అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేసీఆర్ డుమ్మా కొట్టారు: వంశీచంద్‌రెడ్డి
ఏపీ సర్కారు జలదోపిడిని అడ్డుకోవడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తే తెరాస నాయకులు మొహం చాటేశారన్నారు. బహిరంగ చర్చకు రాకపోయినా తానడిగే ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.