పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి పంపుహౌజ్ ముంపుపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. డిపార్ట్‌మెంటల్ కమిటీ రీడిజైన్ చేయాలని చెప్పినట్టు అధికారి తప్పుడు రిపోర్టు ఇచ్చారని ఆరోపించారు. ఏపీ జెన్కో సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి ఉపరితల పంపుహౌజ్ ఉండాలని... భూగర్భ పంపుహౌజ్ నిర్మించవద్దని ఆ రోజు రిపోర్టు ఇచ్చినట్టు వెల్లడించారు.
రీడిజైన్ చేయాలంటూ తప్పుడు నివేదిక ఇచ్చారు: వంశీచంద్ రెడ్డి - పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి పంప్హౌజ్పై వంశీచంద్ రెడ్డి వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి పంపుహౌజ్ ముంపు ఘటనపై ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రీడిజైన్ చేయాలంటూ తప్పుడు నివేదిక ఇచ్చారు: వంశీచంద్ రెడ్డి
పంపుహౌజ్ పనులు జరుగుతుంటే ప్రస్తుతం నడుస్తున్న పంపులకు ఎలాంటి ఇబ్బందులు రావని తప్పుడు నివేదిక ఇచ్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కాసులకు కక్కుర్తిపడడంతోనే మొదటి స్టేజ్ పంపుహౌజ్ మునిగిపోయిందని విమర్శించారు. ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకుల పట్ల పోలీపులు దుర్మార్గంగా ప్రవర్తించారని ఆక్షేపించారు.
ఇదీ చూడండి:'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్