శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఖండించారు. దీనికి సంబంధించి డీజీపీని కలిసేందుకు వెళ్లిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్‌ను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేయడం సరైంది కాదని ఆరోపించారు.
బాధితులను పరామర్శించడం ప్రతిపక్షాల బాధ్యత: దాసోజు - కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్
శ్రీశైలంలో అగ్ని ప్రమాద మృతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల అరెస్టు సరికాదని... ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు మండిపడ్డారు. బాధితులను పరామర్శించడం ప్రతిపక్షాల బాధ్యత కాబట్టి... అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బాధితులను పరామర్శిచడం ప్రతిపక్షాల బాధ్యత: దాసోజు
ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను పరామర్శించడం ప్రతిపక్షాల నైతిక బాధ్యత దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిపిస్తూ... ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Last Updated : Aug 22, 2020, 8:02 PM IST
TAGGED:
protest revanth reddy arrest