దేశంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించిన అధిష్ఠానం... ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. ఆయా రాష్ట్రాల ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో...దిల్లీలో పార్టీ జాతీయ సమావేశం ఏర్పాటు చేసింది.
దిల్లీలో ఏఐసీసీ సమావేశం...పాల్గొననున్న ఉత్తమ్ - దిల్లీలో ఏఐసీసీ సమావేశం
పార్టీని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో దిల్లీలో పార్టీ జాతీయ సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలు సమావేశంలో పాల్గొననున్నారు.

దిల్లీలో ఏఐసీసీ సమావేశం...పాల్గొననున్న ఉత్తమ్
రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చ
కేంద్రంలో భాజపా వైఫల్యాలు ఎండగట్టడంతో పాటు... రాష్ట్రాల వారీగా అధికారంలో ఉన్న పార్టీలను ఎదుర్కొనేందుకు కార్యచరణ సిద్ధం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలు సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా...ఏఐసీసీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశముంది.
ఇదీ చదవండి: విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం'