Aicc leaders meet with revanthreddy house: తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర నేతలు అల్పాహార విందు పేరుతో సమావేశం అయ్యారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించిన జోడో యాత్ర కన్వీనర్ దిగ్విజయ్ సింగ్, ఎంపీ జయరాం రమేష్, కొప్పుల రాజులు రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేశారు. ఇవాళ దసరా కావడంతో...టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారిని అల్పాహర విందుకు ఇంటికి ఆహ్వానించారు.
రేవంత్‌రెడ్డి ఇంట్లో ఏఐసీసీ నేతల అల్పాహార విందు.. - టీపీసీసీ
Aicc leaders meet with revanthreddy house: దసరా కావడంతో...టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారిని అల్పాహర విందుకు ఇంటికి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి అల్పాహార విందుకు...ఏఐసీసీ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి అల్పాహార విందుకు...ఏఐసీసీ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్ రావు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక, తెరాస జాతీయ పార్టీ ప్రకటనలకు చెంది చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు ఈ అల్పాహార విందు సమావేశం రిగినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: