తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ బడ్జెట్లో నిధులు కేటాయించాలని అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా - సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా

ఏపీలోని గుంటూరు జిల్లా సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్​లో తమకు నిధులు కేటాయించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి​ చేశారు.

Agrigold victims hold dharna at CPI office in Guntur
సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా

By

Published : May 18, 2021, 10:27 PM IST

త్వరలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్​ బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా సీపీఐ కార్యాలయంలో సంఘం గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బాధితులు ధర్నా నిర్వహించారు. సంక్షేమ పథకాల కోసం 80వేల కోట్ల వరకు అప్పులు చేసిన ప్రభుత్వం... 20 లక్షల మంది బాధితుల సమస్యను పట్టించుకోవడం లేదని నాగేశ్వరరావు విమర్శించారు.

ఏపీలో అధికారంలోకి వచ్చాక మూడు మాసాల్లోనే 20వేల రూపాయల లోపు డిపాజిటర్లకు సొమ్ము చెల్లిస్తామన్న సీఎం జగన్ హామీని నేరవేర్చాలని అగ్రిగోల్డ్​ బాధితులు కోరారు. మిగిలిన వారికి వీలైనంత త్వరగా డబ్బులు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారన్నారు. ఇప్పటివరకు 400 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని తెలిపారు. వారికి పది లక్షల చొప్పున పరిహారం ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్​ చేశారు. అగ్రిగోల్డ్ సమస్యను పదో రత్నంగా భావించి..... బడ్జెట్లో 4వేల కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:పోలీసుల సంక్షేమానికి రూ. 5 లక్షల విరాళం

ABOUT THE AUTHOR

...view details