కొత్తపేట్‌లోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్నర్సింహగౌడ్తో కలిసి పరిశీలించారు. పండ్ల విక్రయాలపై రైతులు, కమీషన్ ఏజెంట్లతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల సరఫరాల కింద పండ్ల అమ్మకాలు అనుమతించినందున ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు.
మార్కెట్లో పండ్ల విక్రయాలపై మంత్రి ఆరా - పండ్ల మార్కెట్‌ను సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్డౌన్ కొనసాగుతున్నందున మార్కెట్లో పండ్ల విక్రయ సరళిని మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. మార్కెట్లో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు.
మార్కెట్లో పండ్ల విక్రయాలపై మంత్రి ఆరా
అనంతరం ఎల్బీనగర్లో మార్కెటింగ్ శాఖ సంచాలకుల కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే సరకులు తాము కొనుగోలు చేయబోమంటూ పలువురు కమీషన్ ఏజెంట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇవీచూడండి:తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య