తెలంగాణ

telangana

ETV Bharat / city

కళకళలాడనున్న ఖరీఫ్‌... పెరగనున్న సాగు విస్తీర్ణం - పెరగనున్న ఖరీఫ్ సీజన్ విస్తీర్ణం

వానాకాలం సీజన్​లో పంటల సాగు పెరగనుంది. జూన్​ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్​లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనున్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే అదనంగా దాదాపు 28 లక్షల ఎకరాలు సాగు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. అందుకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేసినట్లు ప్రభుత్వానికి తెలిపింది.

agriculture in state
ఖరీఫ్ సీజన్​లో పెరగనున్న సాగు విస్తీర్ణం

By

Published : Apr 26, 2021, 7:51 AM IST

రాష్ట్రంలో వచ్చే జూన్‌ నుంచి ప్రారంభం కానున్న వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసింది. గతేడాది సాగైన 1.34 కోట్ల ఎకరాలతో పోలిస్తే ఈ ఏడాది 28 లక్షల ఎకరాలు అదనంగా పెంచాలనేది లక్ష్యం. మొత్తం 1.62 కోట్ల ఎకరాలకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేసినట్లు ప్రభుత్వానికి తెలిపింది.

* పత్తి, కంది, నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం బాగా పెంచాలనేది వ్యవసాయ శాఖ లక్ష్యం. పత్తి పంటను గతేడాది 60 లక్షల ఎకరాల్లో వేయగా ఈ సీజన్‌లో 80 లక్షలకు చేరుతుందని అంచనా. వచ్చేనెల రెండో వారం నుంచి బీటి విత్తనాల విక్రయాలు ప్రారంభించాలని అన్ని కంపెనీలకు వ్యవసాయశాఖ సూచించింది. 1.75 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీలు వివరించాయి.

* వరి సాగు విస్తీర్ణం సాధ్యమైనంత వరకూ తగ్గించాలని ప్రభుత్వం వ్యవసాయశాఖకు సూచించింది. గతేడాది వానాకాలంలో 53 లక్షల ఎకరాల్లో వరి వేయగా ఈ సీజన్‌లో కనీసం 5 లక్షల ఎకరాలైనా తగ్గేలా చూడాలని వ్యవసాయాధికారులను ఆదేశించింది.

* కంది సాగు విస్తీర్ణం అదనంగా 150 శాతం పెంచి 25 లక్షల ఎకరాల్లో వేసేలా చూడాలి. సంకరజాతి విత్తనాలు సరఫరా చేయాలని జాతీయ, రాష్ట్ర విత్తన సంస్థలతో చర్చించింది.

* గతేడాది 2.25 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా.. ఈసారి 2.29 లక్షల ఎకరాలకు మించకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* మొత్తం 1.62 కోట్ల ఎకరాల లక్ష్యంలో పత్తి 80, వరి 48, కంది 25 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ... రూ.1.97 కోట్లను కాజేసే యత్నం

ABOUT THE AUTHOR

...view details