ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ.. భారత్ బయోటెక్ ప్రతిష్ఠాత్మకంగా తయారుచేస్తున్న కొవాగ్జిన్.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు లభించాయి. ఈ మేరకు భారత్ బయోటెక్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ దిగ్విజయంగా పూర్తైన నేపథ్యంలో మూడో దశ ట్రయల్స్‌కు అనుమతులు లభించినట్టు పేర్కొంది.
నవంబర్ మొదటివారంలో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ - covid vaccine from bharat biotech
![నవంబర్ మొదటివారంలో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ covaxin third phase clinical trials](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9286076-378-9286076-1603454735846.jpg)
17:07 October 23
నవంబర్ మొదటివారంలో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్
దేశ వ్యాప్తంగా 12 సంస్థల్లో.. కొవాగ్జిన్ తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది భారత్ బయోటెక్. మూడో దశ ట్రయల్స్‌ను మొత్తం 25 కేంద్రాల్లో చేపట్టనున్నట్టు వెల్లడించింది. మొత్తం 25 వేల మందికి వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వనుంది. నవంబర్ మొదటి వారంలో ట్రయల్స్ ప్రారంభించనున్నట్టు భారత్ బయోటెక్ పేర్కొంది.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతమైతే కొవాగ్జిన్ పూర్తిస్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.