ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. మూడేళ్ల తర్వాత పెరిగిన డీఏ.. - RTC Employees strike
04:39 April 27
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. మూడేళ్ల తర్వాత పెరిగిన డీఏ..
ఆర్టీసీ ఉద్యోగులకు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరవు భత్యం పెరుగుతోంది. వచ్చే వేతనాల నుంచి అందుకునేలా 5శాతం డీఏను చెల్లించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మూల వేతనంపై ఐదు శాతం వర్తిస్తుందని యాజమాన్యం వెల్లడించింది. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫాం ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.600 నుంచి గరిష్ఠంగా రూ.1,500 వరకు కరవు భత్యం చెల్లించనుంది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంది.
ఇదీ చూడండి: