Tablet for treatment of corona: అమెరికాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకు మరింతగా వ్యాప్తి చెందుతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ తయారు చేసిన కొవిడ్ నివారణ టాబ్లెట్లకు తాజాగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(AFDA) అనుమతినిచ్చింది.
12 ఏళ్ల వయసు పైబడిన వారికి కొవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి ఫైజర్ సంస్థ టాబ్లెట్లకు అనుమతి లభించింది. 'పాక్స్‌లోవిడ్' (Paxlovid) పేరుతో ఈ మాత్రలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (Food and Drug Administration ) ఆమోద ముద్ర వేసింది.