ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు. ఆ గడవు ముగిసి ఇప్పటికే వారం రోజులకు పైగా దాటిపోయింది. ఎన్నికల ప్రక్రియ 45 రోజులకు మించి నిలిచిపోతే...నిబంధనల ప్రకారం మళ్లీ మొదటి నుంచి నిర్వహించాల్సి ఉంటుంది.
అందువల్లే స్థానిక ఎన్నికలు మళ్లీ పునః ప్రారంభించాల్సి ఉంటుందని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. నామినేషన్ల సందర్బంగా చెలరేగిన అల్లర్లు... ఆ తర్వాత ప్రభుత్వ పథకాలను స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో లబ్ధిదారులకు అందజేయడం వంటి వ్యవహారాలు సాగాయి.