Navy Helicopter : భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్‌ఎస్ డేగా’లో సోమవారం అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్-324)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్‌దాస్ గుప్తా జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గల విశాఖలోని ఈ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Navy Helicopter : నేవీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ జాతికి అంకితం - advanced light helicopter
Navy Helicopter : భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్‌ఎస్ డేగా’లో సోమవారం అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్-324)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్‌దాస్ గుప్తా జాతికి అంకితం చేశారు. దీనిని అత్యవసర వైద్య సదుపాయానికి ఎయిర్ అంబులెన్సుగా వినియోగిస్తారు. కమాండర్‌గా ఎస్‌ఎస్ దాస్ సేవలు అందించనున్నారు.

NAVY HELICOPTER: నేవీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ జాతికి అంకితం
ఈ హెలికాప్టర్లను దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో రూపొందించారు. తూర్పు తీరంలో నిఘాకు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ లోహ విహంగం ఉపయోగపడుతుంది. ఏఎల్‌హెచ్ తొలి స్క్వాడ్రన్‌కు ‘క్రెస్ట్రల్స్’ అని నామకరణం చేశారు. ‘చిట్టి డేగ’ అని దీని అర్థం. దీన్ని అత్యవసర వైద్య సదుపాయానికి ఎయిర్ అంబులెన్సుగా వినియోగిస్తారు. కమాండర్‌గా ఎస్‌ఎస్ దాస్ సేవలు అందించనున్నారు.