ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్ బండ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అరెస్టుల్లో భాగంగా పలువురు నాయకులను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇవాళ ఉదయం బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయం నడక చేస్తుండగా అదుపులోకి తీసుకొని నల్లకుంట పోలీస్ స్టేషన్ తరలించారు. భాజపా నగర ఉపాధ్యక్షులు కన్నె రమేష్ యాదవ్‌ను రాత్రి 11 గంటల సమయంలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ముందస్తు అరెస్ట్‌లు - tsrtc strike updates
ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్ దృష్ట్యా పోలీసులు నగరంలోని నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను ఉదయం అదుపులోకి తీసుకోగా... భాజపా నగర ఉపాధ్యక్షుడు కన్నే రమేష్ యాదవ్‌ను గత రాత్రే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
![ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ముందస్తు అరెస్ట్‌లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5009068-124-5009068-1573277820849.jpg)
చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ముందస్తు అరెస్ట్‌లు
ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ముందస్తు అరెస్ట్‌లు
ఇదీ చూడండి : పెయింట్ డబ్బాలు పడేస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త!