police notice to employees: ఏపీలో పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు ప్రకటించిన కలెక్టరేట్ ముట్టడిపై పోలీసులు ఆంక్షలు విధించారు. గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. కలెక్టరేట్ ముట్టడితో శాంతి, భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు పట్టించుకోకుండా ముందుకెళ్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
police notice to employees: ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు.. అతిక్రమిస్తే కఠిన చర్యలు - guntur news
police notice to employees: ఏపీలో పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు ప్రకటించిన కలెక్టరేట్ ముట్టడిపై పోలీసులు ఆంక్షలు విధించారు. గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు.
ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు
APJAC: గురువారం సాయంత్రం 5గంటలకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంయుక్త సమావేశం అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సమ్మెకు ఇప్పటికే సంపూర్ణ మద్ధతు ప్రకటించామని చెప్పారు. ఆర్టీసీలోని ఈయూ, ఎన్‌ఎంయూ సహా అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటాయని వెల్లడించారు.
ఇదీ చదవండి..