పరీక్షల నిర్వహణ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు - తెలంగాణ పరీక్షలు
12:01 September 15
పరీక్షల నిర్వహణ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు
చివరి సెమిస్టర్‌కు ఎప్పటిలాగే రాతపరీక్ష నిర్వహిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అటానమస్ కళాశాలలు వారికి అనుకూలమైన రీతిలో జరుపుకోవచ్చని వెల్లడించింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్‌గా పాసయినట్లు పరిగణిస్తామని పేర్కొంది. చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది.
సప్లిమెంటరీ పరీక్షల తేదీలు చెప్పాలని న్యాయవాది దామోదర్‌రెడ్డి కోరారు. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని ఏజీ వాదించారు. పరీక్షలు ఎలా నిర్వహించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. పరీక్షలను కరోనా జాగ్రత్తలతో నిర్వహించాలని సూచించింది.
సప్లిమెంటరీ పరీక్షలు 2 నెలల్లో నిర్వహిస్తామని జేఎన్‌టీయూహెచ్ తెలిపింది. బుధవారం జేఎన్‌టీయూహెచ్, ఎల్లుండి ఓయూ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.