తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2022, 8:02 AM IST

ETV Bharat / city

Telangana Village Revenue System : గ్రామ రెవెన్యూ వ్యవస్థకు మరమ్మతులు

Telangana Village Revenue System : రాష్ట్రంలో వీఆర్వో, వీఆర్​ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై పరిశీలన జరుగుతోంది. రెవెన్యూ శాఖలో కీలకమైన గ్రామ రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చేందుకు జరుగుతున్న కసరత్తులో భాగంగా.. దీనిపై అధ్యయనం చేయడానికి సర్కార్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ శేషాద్రి నేతృత్వంలో రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ల కమిటీ దీనిపై అధ్యయనం చేస్తోంది.

Telangana Village Revenue System
Telangana Village Revenue System

Telangana Village Revenue System : రెవెన్యూశాఖలో కీలకమైన గ్రామ రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)ను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై పరిశీలన జరుగుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ శేషాద్రి నేతృత్వంలో రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ల కమిటీ దీనిపై అధ్యయనం చేస్తోంది. వచ్చే వారంలోగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

జూనియర్‌ అసిస్టెంట్ల అవసరం ఎక్కడ?

Village Revenue System in Telangana : వీఆర్వోలను సర్దుబాటు చేసేందుకు పురపాలకశాఖను ముందుగా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూశాఖలోనూ మండలస్థాయిలో అయిదుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, ఒక రికార్డు అసిస్టెంట్‌, ధరణి పోర్టల్‌కు ఒకటీరెండు పోస్టులు అవసరమని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి.

వీఆర్‌ఏల మాటేమిటి?

రెవెన్యూ సహాయకులకు ఇప్పటికీ వేతన సవరణ (పీఆర్సీ) ఫలాలు అందలేదు. వారికి పేస్కేలు, ఉద్యోగ క్రమబద్ధీకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం రెండేళ్ల క్రితం పేర్కొంది. అర్హులను ఇతరశాఖల్లో సర్దుబాటు చేస్తామని కూడా చెప్పినా, ఇంకా నెరవేరలేదు. వీఆర్‌ఏలను నీటిపారుదల తదితర శాఖల్లో సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్డీవోలకు రెవెన్యూ డివిజన్‌ లేదా నియోజకవర్గ స్థాయిలో కొన్ని కొత్త అధికారాలు కల్పించాలని భావిస్తున్నారు.

తమ సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) రాష్ట్ర గవర్నర్‌కు పెద్ద ఎత్తున విజ్ఞాపనలు పంపుతున్నారు. గవర్నర్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో జిల్లాల నుంచి వీఆర్‌ఏలు వచ్చి వినతిపత్రాలు వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details