తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్ - ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ తాజా వార్తలు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్​లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆదిత్యనాథ్ ఇప్పటిదాకా నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.

adithya-nath-taken-action-as-andhra-pradesh-new-cs
సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్

By

Published : Dec 31, 2020, 7:13 PM IST

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్​లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. నూతన సీఎస్​ను ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందించారు. ఇప్పటివరకు సీఎస్​గా ఉన్న నీలం సాహ్ని.. ఇవాళ్టితో పదవీ విరమణ చేస్తున్నారు. ఆమె స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదినాథ్ దాస్​ను నియమించింది. ఆయన ఇప్పటిదాకా నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.

'ఆర్థికపరమైన క్లిష్ట పరిస్థితులున్నా ప్రతి అంశానికి పరిష్కారం ఉంటుంది.సుదీర్ఘకాలంపాటు జలవనరులశాఖ బాధ్యతలు పర్యవేక్షించా. ప్రాజెక్టు పూర్తి చేయడంలోనూ నా భాగస్వామ్యం ఉంటుంది. సమస్యలను పరిష్కరించడమే అధికారులుగా మా బాధ్యత. ప్రభుత్వ ప్రాధాన్యతలే ముఖ్యం.. నాకంటూ వేరే ప్రాధాన్యతలు లేవు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి అవుతుంది' -సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

ఇదీ చదవండి:భవిష్యత్తులో విదేశాలకు తెలంగాణ చేపలు: మంత్రి తలసాని

ABOUT THE AUTHOR

...view details