paddy procurement telangana: రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
14:14 December 28
paddy procurement telangana: రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ
paddy procurement telangana: ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం నుంచి మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో పండించిన మొత్తం వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.
ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం నుంచి 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోనున్నట్లు తెలిపింది. గతంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. సర్కారు విజ్ఞప్తితో ఇప్పుడు.. మరో ఆరు లక్షల టన్నులు అదనంగా తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ జైప్రకాష్ లేఖ రాశారు. 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 68.65 లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: