సికింద్రాబాద్‌లో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అడిషనల్ క్రైం డీజీ శిఖా గోయల్.. వలస మహిళా కూలీలకు నిత్యావసర సరకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఉపాధి లేక అవస్థలు పడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమన్నారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన అడిషనల్ క్రైం డీజీ - hyderabad latest news
ఉపాధి లేక అవస్థలు పడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని అడిషనల్ క్రైం డీజీ శిఖా గోయల్ అన్నారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో వలస మహిళా కూలీలకు నిత్యావసర సరకులు, శానిటైజర్లు, మాస్కులు అందించారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన అడిషనల్ క్రైం డీజీ
తమ వంతు సహాయంగా కూరగాయలు, నిత్యావసరాలు అందించినట్లు ఉప్పల ఫౌండేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. గత 40 రోజుల నుంచి పేదలకు, వలసకూలీలకు అన్నదానం చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి:-ఐరోపాలో శాంతిస్తున్న కరోనా.. ఫ్రాన్స్‌లో తగ్గిన మరణాలు