తనకు సినీ పరిశ్రమలో ఎవరూ శత్రువులు లేరని.. హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో (attack on Actress shalu chourasiya in kbr park)తనను చంపాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదని నటి షాలు చౌరాసియా స్పష్టం చేశారు. గత ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో కేబీఆర్ పార్క్‌కు వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా.. ఆమెపై దాడి జరిగింది. ఆమె ఫోన్‌ను ఓ ఆంగతకుడు ఎత్తుకెళ్లాడు.
ఆరోజు ధైర్యం తాను చేయకుంటే.. ఆగంతకుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యేదాన్నంటూ (attack on Actress shalu chourasiya in kbr park) చౌరాసియా తెలిపారు. తొలుత తన ఫోన్ దొంగతనానికి వచ్చినట్లు అనిపించిందని... కానీ తాను స్పృహ కోల్పోయిన.. సమయంలో తనపై లైంగిక దాడి చేసేందుకు ఆగంతకుడు యత్నించినట్లు చౌరాసియా తెలిపారు. ఆ క్షణం తాను అప్రమత్తమయ్యానని.. ఆగంతకుడి సెన్సిటివ్ పార్ట్స్‌పై దాడి చేసి తప్పించుకున్నట్లు చెప్పారు. ఆ క్షణం తనను చంపే యత్నం జరిగినట్లు తెలిపారు.