తెలంగాణ

telangana

ETV Bharat / city

Tollywood drugs case: ఇవాళ ఈడీ విచారణకు ముమైత్ ఖాన్ - undefined

డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నందు, రానా, రవితేజతో పాటు అతని డ్రైవర్‌ శ్రీనివాస్, నవదీప్​, ఎఫ్ ​క్లబ్‌ జనరల్‌ మేనేజర్​ను అధికారులు విచారించారు. నేడు నటి ముమైత్​ఖాన్​ ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

mumaith khan
mumaith khan

By

Published : Sep 15, 2021, 9:52 AM IST

డ్రగ్స్‌ కేసు(Tollywood drugs case)లో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ(enforcement directorate) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే సినీ నటి ముమైత్​ఖాన్ నేడు ఈడీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. కెల్విన్, వాహిద్​లను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది.

గత కొన్ని రోజులుగా విచారణ బృందం సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటీమణులు ఛార్మి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, నటులు రాణా, నందు, రవితేజ, నవదీప్​, ఎఫ్​ క్లబ్​ జనరల్​ మేనేజర్​తో పాటు మత్తు మందు సరఫరాదారులు కెల్విన్‌, వాహిద్‌లను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి వారి ఖాతాల్లో అనుమానాస్పదంగా ఉన్న లావాదేవీలపై అడిగి తెలుసుకున్నారు. కెల్విన్‌, వాహిద్‌ ఎంత కాలంగా తెలుసు, వారి నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేశారా, నగదు బదిలీ ఏ విధంగా చేశారు, ఎంత నగదు చెల్లించారు.. అనే విషయాలపై ఈడీ అధికారులు లోతుగా ఆరా తీశారు.

కెల్విన్‌, వాహిద్‌ బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించిన ఈడీ.. వాటిలో అనుమానస్పద లావాదేవీలను గుర్తించారు. రాణిగంజ్‌లోని ఓ బ్యాంకు ఖాతాలో అనుమానస్పద లావాదేవీలు జరిగినట్టు అనుమానిస్తున్న ఈడీ అధికారులు.. లావాదేవీల వివరాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరారు. ఖాతా వివరాలపై స్పష్టత వచ్చాక మరికొంత మందికి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరే అవకాశం ఉంది.

ఇదీ చదవండి :చిన్నారి హత్యాచార ఘటన-మహేశ్ భావోద్వేగ ట్వీట్

For All Latest Updates

TAGGED:

mumaith khan

ABOUT THE AUTHOR

...view details