Divyavani Resign: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటి, ఆ పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి మరోసారి ప్రకటించారు. ఇటీవల రాజీనామా చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తర్వాత దాన్ని ఆమె డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె బుధవారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు.భేటీ అనంతరం తెదేపాకు రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ఓ వీడియో విడుదల చేశారు. చంద్రబాబుతో భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను గురువారం మీడియా సమావేశంలో వివరించారు.
తెదేపాకు దివ్యవాణి రాజీనామా.. కారణం అదేనట! - దివ్యవాణి రాజీనామా వార్తలు
Divyavani Resign : తెలుగుదేశం పార్టీకి నటి దివ్యవాణి రాజీనామా చేశారు. పార్టీలో అవమానాలు తట్టుకోలేకనే తెలుగుదేశానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తనలాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారని.. కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి అలా ఉంటున్నారన్నారు. గౌరవం లేనిచోట ఉండలేనని ఆమె స్పష్టం చేశారు.
పార్టీలో అవమానాలు తట్టుకోలేకనే తెలుగుదేశానికి రాజీనామా చేస్తున్నట్లు నటి దివ్యవాణి ప్రకటించారు. కొంతకాలంగా పార్టీ కేడర్ తనను అన్ని కార్యక్రమాలకూ దూరం పెడుతూ వస్తున్నారని వాపోయారు. కనీసం ప్రెస్ మీట్లు పెట్టేందుకు కూడా ఎవరూ సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధినేత చంద్రబాబును కలిసి వివరించే ప్రయత్నం చేసినా.. కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ఆరోపణల్ని దివ్యవాణి ఖండించారు. రాజీనామా లేఖను పార్టీకి పంపుతున్నానని తెలిపారు.
క్రైస్తవులు పడే బాధలు తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లకుండా కొందరు తనను అడ్డుకున్నారని సినీనటి దివ్యవాణి విమర్శించారు. క్రైస్తవులకు, పార్టీకి మధ్య దూరం పెరగకుండా ప్రెస్‌మీట్ పెడదామనుకుంటే.. అందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. తనలాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారని.. కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి అలా ఉంటున్నారని దివ్యవాణి తెలిపారు. చంద్రబాబు తనను విసుక్కున్నా తానేం బాధపడడం లేదన్న ఆమె.., ఆయన తన తండ్రి లాంటి వారని అన్నారు. చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే.. అందరికంటే ముందు తానే కౌంటర్ ఇచ్చానని గుర్తుచేశారు. గౌరవం లేని చోట ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబును ఉద్దేశించి తాను కామెంట్లు చేయడం లేదని దివ్యవాణి స్పష్టంచేశారు. బాలకృష్ణ కంటే తానే పెద్ద నటినని ఆమె పేర్కొన్నారు.