తెలంగాణ

telangana

ETV Bharat / city

Sonu Sood on KTR : మంత్రి కేటీఆర్​ను సోనూసూద్ ఏమన్నారంటే..! - మంత్రి కేటీఆర్​ను ప్రశంసిస్తూ సోనూ సూద్ ట్వీట్

రీల్ లైఫ్​లో విలన్​ అయినా.. రియల్​ లైఫ్​లో రియల్ హీరోగా ఆపత్కాలంలో అందరికి అండగా నిలుస్తున్నారు ప్రముఖ నటుడు సోనూ సూద్. సోనూ చేస్తోన్న సేవలను కొనియాడుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దానిపై స్పందిస్తూ.. తెలంగాణ కోసం ఎంతో పనిచేస్తున్న మీరే అసలైన హీరో అంటూ కేటీఆర్​ను సోనూ కొనియాడారు.

telangana news, sonu sood, ktr, sonu sood praised ktr
తెలంగాణ వార్తలు, సోనూసూద్, కేటీఆర్, కేటీఆర్​పై సోనూ సూద్ ప్రశంసలు

By

Published : Jun 1, 2021, 12:03 PM IST

Updated : Jun 1, 2021, 7:15 PM IST

ఆపత్కాలంలో సాయమడిగిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ వారి పాలిట దేవుడవుతున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్. ఆయన చేసిన సేవలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోనూసూద్​ పేదలకు చేస్తున్న సేవలను మంత్రి కేటీఆర్ కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సోనూ.. ఈ గొప్ప పనిని ఇలాగే కొనసాగించాలని కోరారు.

నందకిశోర్ అనే వ్యక్తి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కోసం మంత్రి కేటీఆర్​కు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. అతనికి కావాల్సిన సాయాన్ని అందజేశారు. అడిగిన వెంటనే స్పందించి తనకు సాయం చేసిన కేటీఆర్​కు నందకిశోర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు మీరో హీరో అంటూ కొనియాడారు.

దీనిపై స్పందించిన కేటీఆర్.. నేను ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని.. వారికి సేవ చేయడం నా బాధ్యత అని తెలిపారు. ఎలాంటి పదవి లేకున్నా.. ఏం ఆశించకుండా ఆపదలో ఉన్నవారికి నిస్వార్థంగా సేవ చేస్తున్న సోనూ సూద్ అసలైన హీరో అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

కేటీఆర్​ ట్వీట్​పై సోనూ సూద్ స్పందించారు. తన గురించి మంచి మాటలు చెప్పిన కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా కేటీఆర్.. తెలంగాణకు ఎంతో చేశారని సోనూ ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటిదని.. తనకు పని కల్పిస్తున్న రాష్ట్రమని.. తెలంగాణ ప్రజలు తనను ఎంతగానో అభినందిస్తున్నారని ట్వీట్ చేశారు.

Last Updated : Jun 1, 2021, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details