Prabhas Donation to AP: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్ని దశాబ్దాల్లో చూడని విపత్తును రాష్ట్రం చవిచూసింది. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. తిరుమల, తిరుపతిని జల విలయం చుట్టేసింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరదల కారణంగా ఆస్తి నష్టం, ప్రాణనష్టం వాటిల్లింది. ఇలాంటి విపత్కర సమయంలో బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ముందుకొచ్చారు.
Prabhas Donation to AP: వరద బాధితులకు ప్రభాస్ విరాళం.. ఎంతంటే.? - Prabhas Donation to AP
Prabhas Donation to cm relief fund: ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లు తమ వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. తాజాగా నటుడు ప్రభాస్ సైతం వరద బాధితుల కోసం రూ.కోటి సహాయం ప్రకటించారు.
వరద బాధితులకు ప్రభాస్ విరాళం
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ విరాళం అందించారు. వీరితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించారు. నిరాశ్రయులకు ఈ డబ్బు కొంతైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో సహాయం అందించినట్లు ప్రభాస్ తెలిపారు.
ఇదీ చదవండి:TRS MPs boycott: 'ధాన్యం సేకరణపై సమగ్ర జాతీయ విధానం కావాలంటూ తెరాస బాయ్‌కాట్'