Actor Naresh About His Wife : రమ్యరఘుపతి జరిపే వ్యాపార, ఆర్థిక వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని 'మా' మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు నరేశ్ స్పష్టంచేశారు. వివాహజీవితంలో ఇద్దరి మధ్య స్పర్థలు తలెత్తడంతో ఐదారేళ్లుగా దూరంగా ఉన్నట్టు చెప్పారు. తమ పెళ్లి తరువాత ఇటువంటి వ్యవహారాలు చేస్తున్న ఆమె వల్ల ఇబ్బందులతోనే దూరమయ్యామన్నారు. ఇటువంటి సంఘటనలు మనోవేదనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారికి సొమ్ములిచ్చి సర్దుబాటు చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసిందని చెప్పారు.
"రమ్యరఘుపతి గురించి మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. అవి చూసి చాలా మంది నాకు ఫోన్ చేశారు. నేను ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నాను. ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దాదాపు ఆరేళ్ల నుంచి మేం దూరంగా ఉంటున్నాం. వేర్వేరుగా.. ఎవరి బతుకు వాళ్లం బతుకుతున్నాం. ఇప్పుటు ఆమె వ్యాపార లావాదేవీలు, అప్పుల సమస్యల గురించి వస్తున్న వార్తల్లో నా భాగస్వామ్యం ఏం లేదు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మూణ్నెళ్ల క్రితమే పబ్లిక్ నోటీసు ఇచ్చాను. రమ్యరఘుపతితో.. నాకు నా కుటుంబానికి నా బంధువులకు ఎలాంటి సంబంధం లేదని కొద్దిరోజుల క్రితమే.. నేను పేపర్‌లో ప్రకటన కూడా ఇచ్చాను.