తెలంగాణ

telangana

ETV Bharat / city

'రోజా వనం'లో ఖుష్బూ మెుక్కలు - రోజా వనం న్యూస్

మీరు ముగ్గురికి సాయం చేయండి.. ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సాయం చేయమనండి. ఇదో హిట్ సినిమా కథ లైన్. కానీ మీరు మెుక్కలు నాటండి. మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ వీసరండి... పర్యావరణం గురించి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఈ సవాల్ స్వీకరించిన ఖుష్బూ.. రోజా వనంలో మెుక్కలు నాటారు.

actor-kushbhu-completed-green-challenge
'రోజా వనం'లో ఖుష్బూ మెుక్కలు

By

Published : Mar 1, 2020, 6:14 PM IST

తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​కు విశేష స్పందన వస్తోంది. సినీ నటులు, రాజకీయ నాయకులు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేస్తున్నారు. మరో ముగ్గురిని మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నారు. రోజా వనం పేరుతో సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా.. నటి ఖుష్బూతో మొక్కలు నాటించారు. హీరో అర్జున్ విసిరిన ఛాలెంజ్​ని స్వీకరించిన ఖుష్బూ మూడు మొక్కలు నాటి నటులు మీనా, సుహాసిని, డాన్సర్ బింద్రాలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

'రోజా వనం'లో ఖుష్బూ మెుక్కలు

ABOUT THE AUTHOR

...view details