తెలంగాణ

telangana

ETV Bharat / city

Employees Allotments: కేటాయింపుల తర్వాత విధుల్లో చేరకుంటే యాక్షన్ తప్పదు..!

Employees Allotments: కేటాయింపుల ప్రక్రియ అనంతరం విధుల్లో చేరని ఉద్యోగులపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉద్దేశపూర్వకంగా రిపోర్ట్ చేయని వారిని ఉపేక్షించరాదన్న భావనలో సర్కార్ ఉంది. అటు పరస్పర బదిలీలకు అనుమతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది.

By

Published : Jan 23, 2022, 3:30 PM IST

Actions against employees who do not join duties after allotment ..!
Actions against employees who do not join duties after allotment ..!

Employees Allotments: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం భార్యాభర్తలకు సంబంధించిన స్పౌస్ కేసుల పరిశీలన, పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారిని సంప్రదిస్తున్నారు. అందరితో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఆ దరఖాస్తులపై ఎలా ముందుకెళ్లాలన్న విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

అటు.. పరస్పర బదిలీల విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. పరస్పర బదిలీల విషయంలో సర్కార్ సానుకూలంగానే ఉంది. అయితే పరస్పర బదిలీల పేరిట కొన్ని చోట్ల కొందరు వ్యక్తులు అక్రమాలకు తెరలేపుతున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఉన్నత స్థాయి వరకు ఈ సమాచారం చేరినట్లు తెలిసింది. దీంతో పరస్పర బదిలీల విషయంలో ఎలా చేస్తే బాగుంటుందన్న విషయమై ప్రభుత్వం వివిధ అంశాలను పరిశీలిస్తోంది. పైరవీకారులకు ఆస్కారం ఇవ్వకుండా ఏంచేయాలన్ని అంశంపై దృష్టి సారించింది.

మరోవైపు.. కేటాయింపుల ప్రక్రియ తర్వాత కూడా కొందరు ఉద్యోగులు ఇంకా విధుల్లో చేరలేదు. ఇలా విధుల్లో చేరని వాళ్లు వందకు పైగా ఉంటారని అంచనా. అందరూ ఉద్దేశపూర్వకంగా కూడా హాజరు కాకపోవచ్చని ఆలోచిస్తున్నారు. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకొని ఉద్దేశపూర్వకంగా విధుల్లో చేరని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొదట షోకాజ్ నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాత చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details