తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD EO Dharmareddy: తిరుమలలో జూన్‌ 30 వరకు... ఆర్జిత సేవలు రద్దు - డయల్ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి

TTD EO Dharmareddy: తిరుమలలో ఆర్జిత సేవలు జూన్‌ 30 వరకు రద్దు చేస్తున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. డయల్‌ యువర్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భక్తుల సందేశాలు, సూచనలు ఫోన్‌ ద్వారా తెలుసుకున్నారు.

తితిదే ఈవో ఏవి ధర్మారెడ్డి
తితిదే ఈవో ఏవి ధర్మారెడ్డి

By

Published : May 13, 2022, 9:09 PM IST

TTD EO Dharmareddy: తిరుమలలో వేసవి రద్దీ దృష్ట్యా అష్టాదళం, తిరుప్పాడ ఆర్జిత సేవలను జూన్‌ 30 వరకు తాత్కాలికంగా రద్దు చేశామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఉదయం తిరుమల అన్నమయ్య భవనంలో డయల్‌ యువర్ ఈవో కార్యక్రమం జరగడంతో భక్తుల సందేశాలు, సూచనలను ధర్మారెడ్డి ఫోన్‌ ద్వారా తెలుసుకున్నారు.

శ్రీవారి ఆలయంలో పటిష్టమైన భద్రత ఉందని గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చోరీ జరగలేదని అన్నారు. శ్రీవారి హుండీలో చోరీ జరిగితే విజిలెన్స్‌ అధికారులు ఎప్పటికప్పుడు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటారని తెలిపారు.

తితిదే ఈవో ఏవి ధర్మారెడ్డి

ABOUT THE AUTHOR

...view details