Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిని పులివెందుల కోర్టులో హాజరుపరిచింది. కడప జైల్లో సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని పులివెందులకు తీసుకొస్తోంది. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి... అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు.
వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం.. కోర్టుకు హాజరైన ప్రధాన నిందితులు - వివేకా హత్య కేసు
Viveka Murder Case: ఏపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. పులివెందుల కోర్టుకు చేరుకున్న సీబీఐ అధికారులు... ప్రధాన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిని కోర్టులో హాజరుపరిచారు. ఇకమీదట వివేకానందరెడ్డి కేసు విచారణ పులివెందుల కోర్టు నుంచి కడప జిల్లా కోర్టుకు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసు
శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అభియోగాల వివరాలను పులివెందుల మేజిస్ట్రేట్ నిందితులకు అందజేయనున్నారు. ఇకమీదట వివేకానందరెడ్డి కేసు విచారణ పులివెందుల కోర్టు నుంచి కడప జిల్లా కోర్టుకు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
ఇదీ చదవండి:ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. ప్రకాశ్‌రాజ్‌కు రాజ్యసభ సీటు?