హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో ఈనెల 11న జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు. ప్రణీత్‌రెడ్డి అనే యువకుడిని హతమార్చిన కేసులో నిందితుడు రవిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
భార్యతో కలిసున్నాడనే హత్య.. రిమాండ్‌కు నిందితుడు - hyderabad crime news
చైతన్యపురి పీఎస్ పరిధిలో ఈనెల 11న జరిగిన హత్యకేసులో నిందితుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానమే హత్యకు కారణమని తెలిపారు.
![భార్యతో కలిసున్నాడనే హత్య.. రిమాండ్‌కు నిందితుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5066057-748-5066057-1573748425905.jpg)
భార్యతో కలిసున్నాడనే హత్య.. రిమాండ్‌కు నిందితుడు
సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం మాచునూరి గ్రామానికి చెందిన ప్రణీత్‌రెడ్డి.. హైదరాబాద్‌లోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న జ్యోతి అనే వివాహిత ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన జ్యోతి భర్త రవి.. ప్రణీత్‌తో గొడవపడ్డాడు. తన ఇంట్లో ఉన్న తూకం రాయితో ప్రణీత్ తలపై కొట్టి హతమార్చాడు. మృతుడు సొదరుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఇవాళ రవిని అరెస్ట్ చేశారు. అనుమానమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.
భార్యతో కలిసున్నాడనే హత్య.. రిమాండ్‌కు నిందితుడు
ఇవీచూడండి: బావా అక్కతో కలిసుండాలి.. అన్నందుకు బావమరిదిని చంపేశాడు