తెలంగాణ

telangana

ETV Bharat / city

డ్రైవర్​ నిర్లక్ష్యం.. ఇంట్లోకి దూసుకెళ్లిన కంటైనర్​ - road accident news in guntur district

గుంటూరు జిల్లా సంతగుడిపాడులో విషాదం జరిగింది. కంటైనర్ ఇంట్లోకి​ దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మరొకరికి తీవ్ర గాయాలవగా... నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మహిళ మృతి
మహిళ మృతి

By

Published : Jun 17, 2020, 6:12 PM IST

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో ఓ ఇంట్లోకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో షేక్‌ సైదాబి అనే మహిళ మృతిచెందగా... మరొకరికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే రాష్ట్ర రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి కంటైనర్‌ దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మహిళను నరసరావుపేట ప్రభుత్వాసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కంటైనర్ డ్రైవర్‌ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇదీ చూడండి:కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు పిల్లలు సహా పది మంది మృతి

ABOUT THE AUTHOR

...view details