కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. ఏడుగురికి తీవ్రగాయాలు - కాళేశ్వరం తాజా వార్తలు
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి
20:17 May 28
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. ఏడుగురికి తీవ్రగాయాలు
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. లక్ష్మీ పంప్‌హౌజ్ (కన్నెపల్లి) ఫోర్ బే ప్రాంతంలో కేబుల్ వైర్ తెగడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలవ్వగా మహాదేవపూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
Last Updated : May 28, 2020, 8:47 PM IST