తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ మంత్రుల కాన్వాయ్​కి ప్రమాదం.. 3 వాహనాలు ధ్వంసం - ఏపీలో మంత్రులకు తప్పిన ముప్పు

ఏపీ మంత్రుల కాన్వాయ్‌లో వాహనాలు ఢీకొన్నాయి. అకస్మాత్తుగా కాన్వాయ్‌లోని మొదటి వాహనం బ్రేక్‌ వేయడంతో ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి ఢీకొని 3 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మంత్రులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

accident-in-convoy-of-ap-ministers-in-nellore-district
ఏపీ మంత్రుల కాన్వాయ్​కి ప్రమాదం.. 3 వాహనాలు ధ్వంసం

By

Published : Nov 9, 2020, 4:11 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్‌ప్లాజా వద్ద ఏపీ మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనం డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశారు. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని మిగతా వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. దీంతో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. కృష్ణాపురం వద్ద హై లెవెల్‌ కెనాల్‌ ఫేజ్-‌2 పైలాన్‌ ప్రారంభోత్సవానికి మంత్రులు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే ఈ ఘటనలో మంత్రులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. కాన్వాయ్‌లోని చివరి వాహనాలే దెబ్బతిన్నాయి. కొద్ది సేపటి తర్వాత మంత్రులు అక్కడి నుంచి తిరిగి బయల్దేరి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రెండ్రోజుల క్రితం ప్రగతిభవన్​లో చిరంజీవి.. అధికారులకు కరోనా​ పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details