ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బసినికొండ వీఆర్వో గంగాధర్‌ను అనిశా అధికారుల అదుపులోకి తీసుకున్నారు. బసినికొండకు చెందిన రామకృష్ణ అనే రైతు నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేయగా... కొంతమంది మధ్యవర్తులు జోక్యం చేసుకుని దాన్ని రూ.5 లక్షలకు కుదించారు. అయితే రామకృష్ణ తన ఎకరం భూమి ఆన్లైన్ చేయడం కోసం.. కొంతకాలంగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే అదనుగా భావించి వీఆర్వో రైతును లంచం డిమాండ్ చేశాడు. చేసేదిలేక బాధిత రైతు అనిశా అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం వలపన్నిన అధికారులు... వీఆర్వో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రైతు నుంచి లక్ష లంచం.. వీఆర్వో అరెస్టు - అనిశా అదుపులో బసినికొండ వీఆర్వో గంగాధర్ వార్తలు
ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బసినికొండ వీఆర్వోను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ రైతు నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు. భూవివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు వీఆర్వో గంగాధరం రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బసినికొండ వీఆర్వో